తెలంగాణ

బీజేపీ విభజన రాజకీయాలకు చెంపపెట్టు.. ఢిల్లీ ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఆమ్ ఆద్మీ పార్టీని ఏకపక్షంగా గెలిపించి ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు బీజేపీ విభజన రాజకీయాలకు చెంపపెట్టు అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆప్ విజయంపై వామపక్ష నేతలు వేర్వేరు ప్రకటనల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఆప్ కన్వీనర్ బుర్రా రాము గౌడ్, రాష్ట్ర అబ్జర్వర్ ప్రియాంక కక్కర్, రషీద్, అధికార ప్రతినిధి ముసాఫిర్, రాష్ట్ర నేతలు హనుమంతరావు, అజీమ్ ఉద్దీన్ అసద్ తదితరులు వేర్వేరు ప్రకటనలో అభినందనలు తెలిపారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఎన్నికల్లో అన్ని అంశాలనూ వదిలేసి, మతానే్న అజెండాగా చేసిన దిగజారుడు ప్రచారాన్ని ఢిల్లీ ప్రజలు తిప్పికొట్టారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తన ప్రకటనలో ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ పేరుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న పరీక్షా సమయంలో ఢిల్లీ ప్రజలు విజ్ఞతతో తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. వరుసగా మూడోసారి అద్భుత సారధ్యంతో ఆప్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్పూర్తితో రాజ్యాంగం, లౌకిక వ్యవస్థ పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో ఆయన స్ఫూర్తిదాయక భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్టు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. వేరొక ప్రకటనలో సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను అభినందించారు.
ఆప్ గెలుపు.. దేశానికి మేలుకొలుపు
విద్య వైద్యం ప్రధాన అజెండాగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలిచి దేశానికే ఆదర్శంగా నిలచిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ చైర్మన్ నాగటి నారాయణ అభినందనలు తెలిపారు. అభివృద్ధికి, ఆరోగ్యానికి ఆధారమైన విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ వగైరా ప్రజల కనీస అవసరాలకు భరోసా ఇవ్వడమే సుపరిపాలనగా రుజువు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో పరిపాలించి దేశానికి మేలుకొలుపు కావాలని పేర్కొన్నారు.
*చిత్రం... ట్యాంక్‌బండ్ వద్ద మంగళవారం విజయోత్సవాల్లో ఆప్ కార్యకర్తలు