తెలంగాణ

తుపాకులగూడెం బ్యారేజీకి ‘సమ్మక్క’ పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: గోదావరి నదిపై నిర్మాణం అవుతున్న తుపాకులగూడెం బ్యారేజీకి ఆదివాసీ వీర వనిత, వనదేవత ‘సమ్మక్క’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావును సీఎం ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉండ టం వల్లనే తెలంగాణలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల
నిర్మాణం పూర్తయి తెలంగాణ బీడు భూముల్లోకి కాళేశ్వరం నీళ్లు చేరుకుంటున్న తరుణంలో ఇప్పటికే పలు బ్యారేజీలు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న సందర్భంగా ప్రగతిభవన్‌లో బుధవారం సంబంధిత అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటోందని, ఈ ప్రాజెక్టు పరిధిలో బ్యారేజీలు నిండుకుండలా మారాయన్నారు. వర్షాకాలం నాటికి ప్రాణహిత ద్వారా లక్ష్మీ బ్యారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తిపోసి కాలువలకు మళ్లించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిను సిద్ధం చేసుకొని అప్రమత్తం కావాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించిన పనుల విభజనను ముందుగానే చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఇఎన్‌సీ మురళీధర్‌రావు, ఓఎస్‌డీ శ్రీ్ధర్‌రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...ప్రగతిభవన్‌లో నిర్వహించిన అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్