తెలంగాణ

ప్రగతిభవన్‌లో సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ముఖ్యమంత్రి ప్రధాన కార్యాలయం ప్రగతిభవన్‌లో జరిగిన మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలియచేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ సమావేశాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు బహిష్కరించినట్లు ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు అక్రమంగా జరిగాయన్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆయన చెప్పరు. ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరించిందన్నారు. అందుకే ఈ సమావేశాన్ని బహిష్కరించామన్నారు. రాష్ట్రంలో నియంతృత్వపాలన కొనసాగుతోందని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని భట్టి చెప్పారు. ప్రతిపక్ష వాణిని గొంతునులిమేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా అధికార పార్టీ వ్యవహరించిందన్నారు.