తెలంగాణ

హౌసింగ్ బోర్డు భూములు పేదల ఇళ్లకు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: హౌసింగ్ బోర్డు భూములను అమ్మి ఆ డబ్బును రాష్ట్ర బడ్జెట్‌కు కలపాలనే ఆలోచన అత్యంత దుర్మార్గమైనదని, రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ బోర్డుకు సేకరించిన భూముల్లో మిగిలిన 871 ఎకరాలను కూడా పేదల ఇళ్లకు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. హౌసింగ్ బోర్డు భూములు ఊళ్లకు దగ్గరోనే ఆనుకుని ఉన్నందున ఆ భూములు పేదలకు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ, పేదల నుండి హౌసింగ్ బోర్డు అతి తక్కువ ధరలకు భూములు సేకరించారని, కొంత భూమిలో రాజీవ్ స్వగృహ కింద ఇళ్ల నిర్మాణం చేశారని అన్నారు. కోకాపేటలో అతితక్కువ రేట్లకు భూములు కొనుగోలు చేసి వందల కోట్ల రూపాయిలను అమ్మి ఖజానాకు డబ్బు రాబట్టడానికి ప్రయత్నాలు జరిగాయని అన్నారు. దానిపై కోర్టులో కేసులు కూడా వేశారని చెప్పారు. ఇపుడా భూములను కూడా అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని చెప్పారు.
వరంగల్, నల్గొండ జిల్లాల్లో కూడా హౌసింగ్ బోర్డుకు భూములు సేకరించారని, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇళ్ల నిర్మాణ పథకాలు అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని, డబుల్ బెడ్ రూం ఇళ్లు 2.73 లక్షల మందికి మంజూరు చేసి ఆరేళ్లు గడిచినా 50 శాతం కూడా ప్రారంభించలేదని అన్నారు. అంతకు ముందు చేపట్టిన 1,2,3 దశల్లో ఇందిరమ్మ ఇళ్లు కూడా నేటికీ లబ్దిదారులకు అందలేదని అన్నారు. ప్రభుత్వ భూ ప్రక్షాళన సర్వేలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు కేసుల్లో ఉన్నట్టు తేలిందని , అంతేగాక పారిశ్రామిక మండలాలకు సేకరించిన భూమి వేల ఎకరాలు నేటికీ బీళ్లుగానే ఉన్నాయని అన్నారు. రైతుల నుండి భూములు తీసుకోవడమే తప్ప ఏ కారణంతో తీసుకుంటున్నారో అందుకు భూములను వినియోగించడం లేదని ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇక్కడున్న మురికివాడల్లోని లక్షల మందికి ఇళ్లు నేటికీ దక్కలేదని చెప్పారు.