తెలంగాణ

పీఆర్సీ గడువు పెంపు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: పీఆర్సీ నివేదిక సమర్పణ గడువు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచించిందని వివిధ సంఘాల నాయకులు వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పీఆర్సీ గడువు పెంపు చాలా అన్యాయమని తక్షణమే ఉద్యోగులకు పీఆర్సీ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జాక్టో నేలు, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ -యుఎస్‌పీసీ, తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ, టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు వేర్వేరు ప్రకటనల్లో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూడటమే కాకుండా అనేక అవమానాలను గురిచేస్తూ వంచనకు పాల్పడిందని అందులో భాగంగా 2020 ఫిబ్రవరి చివరి వారంలో పీఆర్సీని ప్రకటిస్తామని చివరి వాగ్దానంగా వెల్లడించిన ప్రభుత్వం , దానిని భంగం చేస్తూ గడువును డిసెంబర్ 31 వరకూ సాగదీస్తూ ఉత్తర్వులు వెలువరించిందని అన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేసినపుడు నెల రోజుల్లోనే అమలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మొదలు ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా మూడు రోజుల్లో పీఆర్సీని అమలు చేస్తామనే నయవంచన ప్రకటనలు అందర్నీ తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తున్నాయని అన్నారు. పీఆర్సీ మీద, ఐఆర్ మీద ప్రభుత్వం , ముఖ్యమంత్రి నిలకడ, నిబద్ధత, నిజాయితీ లేని ప్రకటనలు విధానాలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు టీచర్సు జాక్టో నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీ గడువు పెంపు అన్యాయమని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు.
22 నుండి ఐఎఎల్ జాతీయ మహాసభలు
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఎఎల్) పదో జాతీయ మహాసభలు ఫిబ్రవరి 22 నుండి 24వ తేదీ వరకూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ తెలిపారు. మహాసభలను 22వ తేదీ ఉదయం 10 గంటలకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అఫ్తాబ్ అలం ప్రారంభిస్తారని అన్నారు. ప్రారంభ సభలో రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ సావంత్, మాడభూషి శ్రీ్ధర్, నీలోఫర్ భగవతి తదితరులు హాజరవుతారని అన్నారు.