తెలంగాణ

ప్రతి నీటి బొట్టునూ పొలాలకు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 22: పాలమూరు జిల్లాలో ప్రతి నీటిబొట్టును వినియోగించుకొంటూ రైతుల పొలాలను తడపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా ధరూరు మండలం గుడ్డెందొడ్డి ఫేజ్-1 పంప్‌లను పరిశీలించి నీటి సామర్థ్యం రిజర్వాయర్ లెవల్ తదితర అంశాలను తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో ప్రాజెక్టులను సందర్శించి ట్రయల్న్ ప్రారంభించి వెళ్లగా జెన్‌కో అతిథిగృహంలో బస చేసిన మంత్రులు శుక్రవారం ఉదయం ప్రాజెక్టుల స్థితిగతులను తెలుసుకున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా గుడ్డెందొడ్డి ఫేజ్-1 వద్ద పంపులను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. జూరాల రిజర్వాయర్‌లో ఎగువన వస్తున్న ఇన్‌ఫ్లో బట్టి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌లకు కుడి, ఎడమ కాలువలకు నీరు వాడుకుంటూ వచ్చే పుష్కరాలకు దిగువన కృష్ణానదికి నీరు వదిలేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
గత ఏడాది గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, ఆగస్టులో జరిగే కృష్ణానది పుష్కరాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లాలో నదిపరీవాహక ప్రాంతాలైన పుణ్యక్షేత్రాల్లో పుష్కరఘాట్లను ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఎపి, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చే పుష్కరభక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించినట్లు మంత్రులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి