తెలంగాణ

ఆలయాలకు రెనొవేషన్ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని మరో రెండు దేవాలయాలకు రెనోవేషన్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రెండు ఆలయాలకు ఈ తరహా కమిటీలను నియమించిన ప్రభుత్వం గురువారం మరో రెండు ఆలయాలకు కమిటీలను ఏర్పాటు చేస్తూ జీఓలను జారీ చేసింది. రెవెన్యూ (దేవాదాయ) శాఖ కార్యదర్శి వి.అనిల్‌కుమార్ పేరుతో రెండు వేర్వేరు జీఓలు జారీ అయ్యాయి. సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలోని కొండ పోచమ్మ ఆలయం రెనోవేషన్ కమిటీలో రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, మేడిని పద్మా దేశి రెడ్డి, బండారి నర్సయ్య, గర్నెపల్లి యాదగిరి, ఎన్. ఉర్మిల, బూర్గు నారాయణ, ఎం. బాలమల్లులను సభ్యులుగా నియమించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని పోలెపల్లిలోని శ్రీ ఎల్లమ్మ దేవాలయం రెనోవేషన్ కమిటీలో ఎ.వెంకటేశం, కొడిగంటి అశోక్, దొరమోని వెంకటయ్య, కొత్తూరు నర్సమ్మ, బేర్కుటి చంద్రశేఖర్, కొడిగంటి యాదయ్య, కలిమికుంట నర్సింహులు, నందిగామ సురేందర్ గౌడ్‌లను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీల కాలపరమితి మూడు నెలలే ఉంటుందని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి పరిధిలో ఉన్న ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానానికి ఇటీవల నియమించిన సభ్యులతో పాటు పి. గంగారెడ్డిని కూడా కమిటీలో చేరుస్తూ మరో జీఓ జారీ చేశారు.