తెలంగాణ

‘కాళేశ్వరం’ డిజైన్ మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 22: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ వైస్‌చైర్మన్, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ గోదావరి జలాల వినియోగానికి కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా డిజైన్ చేసినట్లుగా చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారని, వాస్తవానికి 30 ఏళ్ల క్రితమే గోదావరి జలాల వినియోగంతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నారెడ్డి గుర్తించారన్నారు. కాంగ్రెస్ హయాంలో రూపుదిద్దుకున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద లిఫ్ట్‌ను నిర్మించడంతో పాటు మరికొన్నిచోట్ల రిజర్వాయర్లు నిర్మించేలా ప్రాజెక్టును రీడిజైన్ చేశారని చెప్పారు. 160టిఎంసిల గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు మేడిగడ్డ నుండి 120 రోజుల పాటు నీటి లభ్యత ఉంటుందని, పంటకాలం కూడా 120రోజులే అయినందున మేడిగడ్డ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎలాంటి లిఫ్ట్‌లు లేకుండా 18లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునన్నారు. అందువల్ల 50టిఎంసిల సామర్ద్యంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌ను నిర్మించాల్సిన అవసరమే లేదన్నారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్వాసితులు వ్యతిరేకిస్తూ 14 గ్రామాల ప్రజల ఆందోళనలు తీవ్రతరం చేస్తుండగా వారికి భరోసాను కల్పించాల్సిన ప్రభుత్వం కృత్రిమ ఆందోళనలను సృష్టిస్తోందని ఆరోపించారు. మలన్నసాగర్ కింద వెయ్య గ్రామాలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని కోరారు. మల్లన్నసాగర్ నుండి నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సైతం నీళ్లు ఇవ్వవచ్చునని చెబుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మోసగిస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులను నిర్మించేందుకు యత్నిస్తున్నందున అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి పనులను నిలిపివేయిస్తామని చెప్పారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు అండగా ఉండి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని భరోసానిచ్చారు. నల్లగొండ జిల్లాలోని గడ్డిపల్లిలో గల మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాన్ని 50 ఏళ్ల క్రితమే అద్భుతమైన రీతిలో డిజైన్ చేశారని, సాగర్‌కాల్వ నుండి ఎత్తు పల్లాలతో ప్రాజెక్టును నిర్మించి నీటిని అందిస్తున్నారని చెప్పారు. 50 ఏళ్ల క్రితమే అద్భుతమైన డిజైన్‌ను చేయగా నేడు ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఇష్టానుసారంగా డిజైన్ చేస్తుందన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి