తెలంగాణ

భవన నిర్మాణ సెస్ బకాయిలు వసూలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23; హైదారబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ సెస్స్‌ను వసూళ్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆదివారం నాడు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, కోటంరాజు మీడియాతో మాట్లాడారు. నగరంలో 2014 నాటి నుంచి ఇటు కార్మిక శాఖ, అటు జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి వసూళ్లు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సెస్స్ వసూళ్లు చేయని అధికారులపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నూతన వెల్పేర్ బోర్డ్ కమిటీని నియమించాలని వారు సూచించారు.
60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు నెలకు రూ.10,000/ పెన్షన్ ఇవ్వాని వారు డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వారు కోరారు.
ఈనెల 25న చలో లేబర్ కమిషనర్ ఆఫీస్ వద్ద భారీ ధర్నాకు భవన కార్మికులు తరలిరావాలని వారు పిలుపు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత మూడేళ్లలో 40,000 నిర్మాణాలు జరిగాయన్నారు. మెట్రో రైలు నుంచి రూ.360 కోట్లు, మిషన్ భగీరథ నుంచి రూ.366 కోట్లు, వివిధ ప్రాజెక్టుల నుంచి 2 వేల కోట్లు వసూళ్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు.