తెలంగాణ

అమెరికా ప్రయోజనాల కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: అమెరికా దేశాధినేత ట్రంప్ భారత పర్యటన కేవలం అమెరికా ప్రయోజనాల కోసమేనని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మరో పక్క 24వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని ప్రజాసంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నాడు బేగంపేట అమెరికన్ కాన్సలేట్ ఎదుట నిరసన ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా జరుగుతున్న ప్రచారం , ప్రకటనలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని తమ్మినేని పేర్కొన్నారు. కేవలం మోదీని పొగుడుతూ మన దేశాన్ని, ప్రజలను, విధానాలను విమర్శిస్తూ రెండు రోజుల క్రితం ట్రంప్ చేసిన ప్రకటన పట్ల సీపీఎం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దేశ ప్రయోజనాలను ఇంకో దేశానికి తాకట్టు పెట్టి మోకరిల్లడం , హూస్టన్ సభకు వెళ్లినపుడు ట్రంప్‌ను తిరిగి అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నుకోమని మోదీ కితాబు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచిందని అన్నారు. ఒక పక్క ట్రంప్ అమెరికాలో అమలు చేస్తున్న పలు విధానాల వల్ల అక్కడ నివాసం ఉంటున్న భారతీయులు అంతా తీవ్రంగా కలత చెందుతున్నారని ముఖ్యంగా గ్రీన్ కార్డుల అంశం, పర్మినెంట్ లీగల్ రెసిడెన్సీలు, అక్కడ పుట్టే శిశువులకు ఇచ్చే సిటిజన్ షిప్ రద్దు చేస్తూ భారతీయులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. దాని గురించి నరేంద్రమోదీ మాట్లాడటం లేదని, పన్నులు ఎక్కువ అనే పేరుతో మన ఎగుమతులపై ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారని, ట్రంప్ పర్యటన ఏ విధంగా చూసినా అమెరికా ప్రయోజనానికే తప్ప మన దేశ ప్రయోజనాలకు కాదని అన్నారు. అతి పెద్ద నిత్యావసర మార్కెట్‌గా ఉన్న భారత్‌ను ట్రంప్‌కు అప్పగించాలని మోదీ ఉవ్విళ్లూరుతున్నారని పేర్కొన్నారు. భారత్‌కు పాలు, ఫౌల్ట్రీ, యాపిల్స్, బాదం తదితరాలు ఎగుమతులు పెంచాలని అమెరికా ఆరాటపడుతోందని, ఇదే జరిగితే దేశంలో కోట్లాది మంది రైతులు రోడ్డున పడతారని అన్నారు. ఇప్పటికే వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, లక్షలాది మంది ట్రంప్‌కు స్వాగతం పలకడం చూస్తుంటే అదంతా మోదీ కీర్తికోసమేనని అన్నారు.
మార్కెట్ విస్తరణకే :టీటీఎఫ్
కాగా వేరొక ప్రకటనలో భారత్ మార్కెట్‌ను ఆక్రమించేందుకే ట్రంప్ పర్యిటిస్తున్నారని టీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు ఈ రఘునందన్ పేర్కొన్నారు. భారత్‌లో మార్కెట్ విస్తరణకు, అందులో ఆటంకంగా ఉన్న సుంకాల తగ్గింపుకోసమే ట్రంప్ భారత్ పర్యటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ పర్యటన భారత వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుందని అన్నారు. దేశంలో ఫౌల్ట్రీ, డయిరీ రంగాలను లక్ష్యంగా చేసుకుని పర్యటిస్తున్నారని చెప్పారు.
24న దేశవ్యాప్త నిరసనలు
ట్రంప్ పర్యటన నిరసిస్తూ 24న దేశవ్యాప్త నిరసనలు వ్యక్తం చేయాలని ప్రజాసంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఇందులో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, చేతి వృత్తిదారిల కన్వీనర్ ఎంవీ రమణ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు మందుల విప్లవ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, సీఐటీయూ కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొన్నారు.