తెలంగాణ

అన్ని జిల్లాల్లో అక్రమ వలసదారుల సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్రమ వలసదారుల వివరాలను సేకరించాలని, అందుకు సర్వే నిర్వహించాలని బీజేపీ ప్రతినిధి బృందం డీజీపీ ఎం మహేందర్‌రెడ్డిని కోరింది. సోమవారం నాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, పార్టీ నేతలు టీ రాజశేఖరరెడ్డి, డాక్టర్ ఎన్ గౌతం రావు, అట్లూరి రామకృష్ణ తదితరులతో కలిసి డీజీపీని కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో రొహింగ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని తాము చాలా సార్లు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని, అదే విధంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రొహింగ్యాలు సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారని , పరిశీలన చేస్తున్న కొద్దీ అనేక మంది అక్రమ వలసదారుల చిట్టా బయటకు వస్తోందని వారు చెప్పారు. గతంలోనే తాము అనేక మార్లు వినతిపత్రాలను ఇచ్చినా అధికారులు వాటిని సీరియస్‌గా తీసుకోలేదని, పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల 127 మంది అక్రమ వలసదారులు ఆధార్ కార్డులను ఇతర కార్డులను అక్రమంగా సంపాదించుకున్నారని తెలిసిందని, అందుకు వారు తప్పుడు ధృవపత్రాలను సమర్పించారని అన్నారు. వీరిలో 124 మంది రొహింగ్యాలేనని తెలిసిందని వారు చెప్పారు. వాస్తవానికి తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న వారు వీరు మాత్రమే కాదని, అనేక వేల మంది వలస ఉంటున్నారని చెప్పారు. ఈ గణాంకాలపై ఎవరికీ స్పష్టత లేదని అన్నారు. ఇప్పటికైనా అన్ని జిల్లాల్లో సర్వే నిర్వహించి వాస్తవికంగా అక్రమ వలసదారుల డాటాను సేకరించాలని వారు డిమాండ్ చేశారు.

*చిత్రం... డీజీపీని కలిసి బయటకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు