తెలంగాణ

నయాం కుటుంబ సభ్యులకు ఐటీ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఫిబ్రవరి 25: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ ఎన్‌కౌంటర్లో మరణించినా ఆయన అక్రమాలు, అక్రమార్జనపై ప్రభుత్వ శాఖలు కొరడా ఝుళిపిస్తూనే ఉన్నాయి. నరుూం అక్రమార్జనలో భాగంగా బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూముల వివరాలు సమర్పించాల్సిందిగా కోరుతూ ఆదాయపు పన్నుశాఖ అధికారులు భువనగిరి మండలం అనంతారం గ్రామంలో నరుూం తల్లి తాహేరాబేగం, భార్య హసీనాబేగం, సోదరి సలీమాబేగం, అనుచరుడు పాశం శ్రీనివాస్ పేరుతో రిజిస్టరయిన భూముల లావాదేవీలపై నోటీసులు జారిచేశారు. వారు అందుబాటులో లేకపోవడంతో నోటీసులను ఐటీ అధికారులు నరుూమొద్దీన్ ఇంటిగోడలపై అతికించి వెళ్ల్లారు. సర్వేనెం. 340/ఎ4లో 123 గుంటలు, సర్వేనెం. 340/ ఎ5లో 123 గుంటలు, 340/ఎ6లో 122.25 గుంటల భూమి మొత్తంగా సుమారుగా 50 లక్షల రికార్డువిలువ ఉండగా మార్కెట్‌విలువ సుమారుగా 15 కోట్లరూపాయలుంటాయని అంచనా.