తెలంగాణ

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని టీఎన్‌జీవోస్ భవనంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర మహాసభల సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ త్వరలో ఉమ్మడి జిల్లాలో టీయూడబ్ల్యూజే జిల్లా నూతన కార్యవర్గాలను ఎన్నుకుంటున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో మృతి చెందిన 259 మంది జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా నిధులు అందించినట్టు చెప్పారు. అలాగే జర్నలిస్టు మృతుల కుటుంబాలకు ప్రతి నెలా రూ. 3 వేల పింఛన్ కూడా అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో 18 వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్ని జిల్లాల్లో కొందరు జర్నలిస్టులు అక్రిడేషన్‌లు మంజూరు కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, వారికి కూడా అక్రిడేషన్‌లలు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వం అక్రిడేషన్ పొందుటకు జర్నలిస్టులకు డిగ్రీ విద్యార్హత కల్పించగా ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడి ఈ విద్యార్హతను సడలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వం జర్నలిస్టుల వైద్యం కోసం హెల్త్ కార్డుల ద్వారా ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసినట్టు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరూ హెల్త్‌కార్డులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జర్నలిస్టులు తమకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయించాలని విన్నవించారని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరయ్యేలా తాము కృషి చేస్తామన్నారు. అలాగే మహాసభలు అయినా తరువాత స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, సంఘం నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యే విధంగా చర్యలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం 5 లక్షల బీమా సౌకర్యం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ బీమా సౌకర్యాన్ని జర్నలిస్టులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏజెన్సి ప్రాంతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల్లు మంజూరు కోసం ఇబ్బందులు అవుతున్నాయని, అందువల్ల ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యను పరిష్కరిస్తామని ఆయన కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏకైక సంఘం టీయూడబ్ల్యూజేనని ఆయన పేర్కొన్నారు.
*చిత్రం... నిర్మల్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల సన్నాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ