తెలంగాణ

రాహుల్ గాంధీయే ఏఐసీసీ అధ్యక్షుడు కావాలి.. అవుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 26: ఏఐసీసీకి రాహుల్‌గాంధీయే అధ్యక్షుడు కావాలని, అవుతారని అదే తన కోరిక, తన అభిప్రాయం అని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్‌భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు కావాలని విధేయుల ఫోరం కోరిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో మిషన్ భగీరధ ద్వారా ప్రజలందరికీ తాగునీరందిస్తామని మార్చి 2018 లోగా నల్లా కనెక్షన్లు అందరికీ ఇస్తామని 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన పనులు కేవలం కమీషన్ల కోసమే చేసినట్టుగా కనపడుతోందని ఆరోపించారు. ఎన్ని నల్లాలు ఇచ్చారో వివరించాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కు సవాల్ చేశారు. ఆరేళ్లుగా మిషన్‌భగీరథ పనులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ప్రజల మేలుకోసం కాదని వారి లాభం కోసమే మిషన్ భగీరథ పనులని ఆరోపించారు. అదేవిధంగా డబుల్‌బెడ్ రూం ఇల్లు ఒక్కటి కూడా కానరావడం లేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి చూపకపోగా, ఇస్తానన్న భృతి జాడ లేదన్నారు. రైతుబంధు పథకం కింద ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి సహాయం అందలేదని, రైతుబంధు ఎన్నికల బంధుగా మారిందని ఆరోపించారు. మైనార్ట్టీలకు 12, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఎక్కడ అని ప్రశ్నించారు. అన్నింటా విఫలమైన సీఎం కేసీఆర్ ప్రజలను మాటలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు కే.శంకర్‌నాయక్, మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి