తెలంగాణ

కేసులకు బెదరను.. ప్రజా సమస్యలపై పోరాడుతా: రేవంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తనను రకరకాల కేసులతో వేధించినా, భయపెట్టినా, వెనకాడే ప్రసక్తిలేదని, ప్రజా సమస్యల సాధనకు దేనికైనా సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ నగరంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తే తాను భయపడుతానని కేసీఆర్ అనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదన్నారు. తాను ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమైనప్పుడల్లా నిరాధారరమైన ఆరోపణలతో కేసులను నమోదు చేయడం కేసీఆర్ సర్కార్ అలవాటైందన్నారు. రాష్ట్రప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అధికారంలోకి వచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తే భయపడబోమని ఆయన స్పష్టం చేశారు. గోపన్‌పల్లి భూ అక్రమాల ఆరోపణలపై తాను ఇప్పటికే తన స్పందన చెప్పానన్నారు. ఎన్నికేసులు పెట్టుకున్నా, బెదిరే పనిలేదన్నారు. ఇవన్నీ తనకు లాభాలని ఆయన చెప్పారు. ఎన్ని కేసులు పెడితే అన్ని పట్టాలను ప్రభుత్వం ఇచ్చినట్లు భావిస్తానన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేయకుండా వైఫల్యం చెందిన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు.