తెలంగాణ

పంట రుణమాఫీకి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట రుణ మాఫీకి రాష్ట్ర ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు పంట రుణ మాఫీ చేయనున్నట్టు శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత హయాంలో కూడా ఇదే మాదిరిగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున పంట రుణాన్ని మాఫీ చేసిన విష యం తెలిసిందే. తమ ప్రభుత్వం గతంలో పంట రుణాలను మాఫీ చేసిన విధంగానే మ ళ్లీ అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గత హయాంలో పంట రుణాలను మొత్తంగా కలిపి దాదాపు రూ.17 వేల కోట్లు మాఫీ చేసింది. గతంలో మాఫీ చేసిన మొత్తాని కంటే ఈసారి అటుఇటుగా వెయ్యి కోట్లు ఎక్కువ ఉండవచ్చని అం చనా వేసింది. గత హయాంలో పంట రుణాలను నాలుగు విడతల్లో రూ.4,250 కోట్ల చొప్పున మాఫీ చేయగా, ఈసారి ఒక్కో విడతకు రూ.6 వేల కోట్ల చొప్పున మూడు విడతల్లో మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనే పం ట రుణ మాఫీకి ప్రభుత్వం రూ.6 వేల కోట్లను ప్రతిపాదించింది. అయితే దేశం తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న కారణంగా ఆ ప్రభావం ఎంతో కొంత రాష్ట్రంపై కూడా పడడంతో పంట రుణ మాఫీకి జాప్యం జరిగింద ని ఆప్పట్లో ఆర్థిక శాఖను కూడా నిర్వహించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా వివరించారు. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరున ముగియనుండడం తో బడ్జెట్‌లో ఇప్పటికే కేటాయించిన పంట రుణ మాఫీకి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థి క శాఖ, వ్యవసాయ శాఖలను ముఖ్యమంత్రి ఆదేశించారు. తాజాగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్లు, వైస్ చైర్మన్లతో సమావేశమై న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పంట రుణ మాఫీ ప్రక్రియ జరుగుతు న్న విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన రూ.6 వేల కోట్లతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) బడ్జెట్‌లోనూ మరో 6వేల కోట్లను కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది మా ర్చి నెలాఖరున వార్షిక బడ్జెట్ ముగిసే నాటికి పంట రుణ మాఫీని రెండు విడతలుగా పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా మూడు విడతల్లో రూ.18 వేల కోట్ల రుణాల మాఫీ చేయాల్సి ఉంటుం ది. పంట రుణ మాఫీ 17 వేల కోట్లు ఉంటుందని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి దశలో అం చనా వేసినప్పటికీ అది రూ.15 వేల కోట్లకు మించలేదు. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష వంతున మాఫీ మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనతో పాటు రైతుల ఆధార్ కార్డులను రుణ మాఫీకి అనుసంధానం చేయడంతో సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అయింది. ఈసారీ రుణ మాఫీకి రూ.18 వేల కోట్లకు అంచనా వేసినా గతంలో కంటే పెద్దగా పెరిగే అవకాశం లేకపోవచ్చని తెలుస్తోంది.