తెలంగాణ

పోలీస్ శాఖలో వినూత్న సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: అధునాతన సౌకర్యాలు, వసతులతో బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోలీస్ శాఖలో వినూత్న సంస్కరణలు
తీసుకువచ్చారన్నారు. బంజారాహిల్స్‌లో రూ.350 కోట్లతో
ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనంలో జీ ప్లస్ 19, జీ ప్లస్ 14 అంతస్థులతో కూడిన ఐకానిక్ భవనం ట్విన్ టవర్స్ పోలీసింగ్ సేవలను అందిస్తుంది. వివిధ టెక్నాలజీలతో గ్లోబల్ స్టాండర్డ్స్ వంటి అనువర్తనాలు, వీడియో విశే్లషణలు ఓవర్‌కు అనుసంధానం చేశారు. లక్ష సీసీటీవీ కెమెరాలు, జాయింట్ వీడియో హాల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీస్, క్రైమ్ కంట్రోల్ ప్రాసెస్, నియంత్రణ సెన్సార్లు, నెట్‌వర్క్ పరికరాలు, భౌగోళిక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), డయల్ 100తో ఇంటిగ్రేటెడ్, ఫైర్, అంబులెన్స్, టెట్రా (టెరెస్ట్రియల్ ట్రంక్డ్ రేడియో), దీనికి వీడియో, ఆడియో కాన్ఫరెన్సింగ్ సెంటర్ ఉంటుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి విభాగాలతో ఏజెన్సీలు ఈ కేంద్రం నేరాల అవసరాలను తీర్చనుంది. విశే్లషణ, పర్యవేక్షణ, హౌసింగ్ యాంటీ టెర్రర్ కమాండో జట్లు, త్వరితగతిన ప్రతిచర్య బృందాలు, నగరం విపత్తు ప్రతిస్పందన యూనిట్, క్రౌడ్ కంట్రోల్ జట్లు భవనం పైకప్పు వద్ద హెలిప్యాడ్ (హెలి బేస్)ను ఏర్పాటు చేస్తున్నారు. అధునాతన సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ భవనం ఆధునికతకు స్టేట్ ఆఫ్ ఆర్ట్‌గా కలిగి ఉంటుంది. ఈ భవనంలో చేపడుతున్న ఆపరేషన్స్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ నిర్మాణ పనులను హోం మంత్రి డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ఇతర పోలీసు అధికారులతో కలిసి తనిఖీ చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు.

*చిత్రం... బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంగళవారం నాడు సందర్శిస్తున్న
హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి