తెలంగాణ

వ్యాపమ్‌ను తలదనే్నలా ఎంసెట్ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: వ్యాపమ్‌ను తలదనే్నలా ఎంసెట్-2 కుంభకోణం జరిగిందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని టి.పిసిసి అధికార ప్రతినిధి కొనగాలి మహేశ్ డిమాండ్ చేశారు. ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రమేయం ఉందని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర ఫ్రనుత్వం ఒకసారి ఎంసెట్ అని, మరోసారి ‘నీట్’ అని, ఎంసెట్-2 అని వివిధ రకాల ప్రకటనలు చేసి పేద విద్యార్థులను బలి చేసిందని కొనగాల మహేశ్ విమర్శించారు. ఈ కుంభకోణంపై ప్రభుత్వం ఆదేశించిన సిఐడి విచారణపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. ముఖ్యంగా ఓఎంఆర్ షీట్ల ప్రక్రియలోనే అక్రమాలు జరిగాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్‌సి, ఇంటర్ బోర్డులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన మ్యాగ్నటిక్ ఇన్‌ఫో-టెక్ కంపెనీకే ఎంసెట్-2ను అప్పగించారని ఆయన తెలిపారు. 2014 సంవత్సరంలో 1400 మంది మెరిట్ విద్యార్థుల లిస్ట్ తయారు చేయకుండా వారిని ఐఐటి అవకాశాలకు దూరం చేసి వారి భవిష్యత్తును పాడు చేసిన సంస్ధకే తిరిగి ఇంత ముఖ్యమైన ఎంసెట్, ఇ-సెట్, లాసెట్, ఎడ్‌సెట్, పిజిసెట్‌ల వంటి ప్రక్రియలను ఎందుకు అప్పగించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వీటన్నింటిని పరిశీలిస్తే విద్యా శాఖ మంత్రికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందన్న అనుమానాలకు బలం చేకూరుతున్నదని అన్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కొనగాల మహేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.