తెలంగాణ

విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు జి. పద్మజారెడ్డి, ప్రధాన కార్యదర్శులు కె. రవళి, జి. ఉమారాణి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉమ్మడి రాష్ట్రంలో కెసిఆర్ డిమాండ్ చేశారని వారు శుక్రవారం విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు. ఈ సందర్భంగా లోగడ కెసిఆర్ చేసిన ప్రకటనల ప్రతులను వారు మీడియాకు అందజేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై వత్తిడి పెంచేందుకు వివిధ కార్యక్రమాలు, సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆగస్టు 1 నుంచి 6వ తేదీ వరకు మహిళా అధ్యాపకులు, ఉపాధ్యాయులతో వేర్వేరు ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆగస్టు 7 నుంచి 17వ తేదీ వరకు సెప్టెంబర్ 17పై మహిళా కళాశాలల్లో వ్యాస రచన పోటీలు, సంతకాల సేకరణ నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే నెల 17 నుంచి 24వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించి సెప్టెంబర్ 17వ తేదీ ప్రాథాన్యతను తెలియజేస్తామని అన్నారు.