తెలంగాణ

నిషేధిత వలలు వాడితే క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: నిషేధిత అలివిగాని వలలను వినియోగించి చేపల వేట కొనసాగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి టీ.శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలకు గండి కొట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మత్స్య శాఖ కమిషనర్ సువర్ణకు సూచించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను గండి కొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ, పోలీస్, మత్స్య శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమ చేపల వేట నిరోధానికి తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి చెప్పారు. అలివిగాని వలలతో చేపల వేట సాగిస్తున్న వారు అత్యధికంగా ఆంధ్రప్రాంత మత్స్యకారులు ఉన్నందున ఈ విషయాన్ని ఏపీ మత్స్యశాఖ దృష్టికి తీసుకెళ్లాలని మత్స్య శాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు.