తెలంగాణ

పోలీసుల అదుపులో కాంగ్రెస్ నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, మార్చి 7: జన్వాడలోని కేటీఆర్ బంధువు ఫామ్‌హౌస్ వద్దకు వెళ్లేందుకు తరలిన కాంగ్రెస్ నాయకులను నార్సింగి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనస సభ ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీ్ధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి, వీరయ్య, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ను నార్సింగి చౌరస్తా ప్రాంతంలో అడ్డుకోని అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు శాసనసభలో సస్పెండైన వీరు ప్రదర్శనగా జన్వాడలోని కేటీఆర్ బంధువు పామ్ హౌస్‌గా బయలుదేరారు. ఫామ్‌హౌజ్ వద్దకు వస్తున్నాన్న పక్కా సమాచారంతో మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో నార్సింగి, రాజేంద్రనగర్, మాదాపూర్ పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది రోడ్డుపై భారీ క్రేడ్‌లను ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా తనిఖీ చేసి పంపించారు. మధ్యాహ్నం సమయంలో కారులో వచ్చిన భట్టి విక్రమార్కతో పాటు శ్రీ్ధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి, వీరయ్య, మాజీ ఎమ్మెల్యే అనిల్ వాహనాలను అడ్డుకున్నారు. ఈ సమయంలో ప్రజాప్రతినిధులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 111 జీవో అమలులో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాల్సిన ప్రభుత్వ ప్రతినిధులే వాటిలో నిర్మాణాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వారందరిని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకట్టుపై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.