తెలంగాణ

ఎర్రబెల్లి, రాజ్‌గోపాల్ మధ్య వాగ్వాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: ప్రశ్నించే గొంతు నొక్కుతారా ? గవర్నర్ చేత అవాస్తవాలను ప్రజలకు తెలియచేశారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన వాళ్లం. ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మాకుంది. ప్రజాస్వామ్య పార్టీలను గౌరవించరా ? తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా ? డబ్బులు పంపిణీ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అడ్డుతగిలిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును నీవు తెలంగాణ ద్రోహివి అంటూ ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి, ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఎర్రబెల్లి మాట్లాడుతూ మిమ్మలను ఉరికించి కొడతారు. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ప్రభుత్వంపై అనవసరంగా అపనిందలు వేయవద్దు అంటూ కోరారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీల మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది.
అనంతరం రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనకు సీఎం అంటే గౌరవం ఉందని, ఉద్యమకారుడికి తాను ఎంతో గౌరవించానని చెప్పారు. తమకు వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే అభిమానమని చెబుతూనే, ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ఎండగడితే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వారా అని అడిగారు. రాష్ట్రంలో కేసీఆర్ కిట్స్ తప్ప ఆసుపత్రుల్లో ఎటువంటి వైద్య సేవలు లేవన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు భజనపరులుగా మారారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎన్ని కట్టారని ఆయన అడిగారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించలేకపోతే లబ్థిదారులకు రూ.2లక్షలు ఇస్తే ఒక రూం కట్టుకుంటారన్నారు. తెలంగాణ ద్రోహులను తెచ్చి నెత్తిమీద పెట్టుకున్నారని ఆయన కేసీఆర్‌ను విమర్శించారు. ఎర్రబెల్లి మాట్లాడిన భాష బాధాకరమన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ చాలని, 24 గంటలు ఎందుకన్నారు. పరిశ్రమలు, గృహ వినియోగానికి 24 గంటల విద్యుత్ అవసరమన్నారు.