తెలంగాణ

సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌సీ అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు సభలో మాట్లాడుకుందామని, అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన సభలో మాట్లాడుతూ ఈ అంశాలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అనవసరంగా మాట్లాడి ఉద్రిక్తతలు సృషించవద్దని కోరారు. ఈ అంశంపై అవసరమతే ఒక రోజంతా మాట్లాడుకుందామన్నారు. మన అభిప్రాయాలను కేంద్రానికి తెలియచేస్తామని ఆయన అన్నారు. భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో ఉండడం సహజమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సభ మెజారిటీ అభిప్రాయాలను స్వీకరించి కేంద్రానికి తీర్మానం పంపిస్తామన్నారు. ఈ విషయమై అనేక అపోహలు ఉన్నాయన్నారు. అయతే, ఈ అంశాలను వివాదాస్పదం చేయవద్దన్నారు.