తెలంగాణ

వైద్య సేవల్లో మనమే మేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రప్రభుత్వం అద్భుతమైన విజయాలను నమోదు చేసిందని సామాజిక ఆర్థిక అవుట్‌లుక్ 2020 ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలో 2013లో శిశు మరణాల రేటు 92 ఉంటే, 2017 నాటికి 76కు పడిపోయింది. గతంలో పేద మహిళలు కాన్పుల నిమిత్తం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటే వెనకాడే పరిస్థితి ఉండేది. ఆరేళ్ల కేసీఆర్ పాలనలో కేసీఆర్ కిట్స్ పథకం వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు 31 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఐఎంఆర్ కూడా 2014లో 34 ఉంటే 2017లో 29కి పెరిగాయి. అండర్ 5 మరణాల రేటు కూడా 40 నుంచి 32కు తగ్గాయి. ప్రతి లక్ష జననాలకు మాతాశిశు మరణాల రేటు 70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జననాలకు మాతా శిశు మరణాల రేటు 122 ఉంటే, తెలంగాణలో 76 నమోదైంది. కేసీఆర్ కిట్స్ పథకం కింద అనవసరమైన సిజేరియన్ సర్జరీలను తగ్గించారు. గర్భిణులకు వేతనాలు ఇవ్వడం, మాతాశిశు మరణాల రేటును తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ కిట్స్‌కు విశేష స్పందన లభిస్తోంది.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 108 ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో మెటర్నటీ, చైల్డ్ హెల్త్ సేవలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆఫ్తమాలజీ, పిడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, ఈఎన్‌టీ విభాగాల ద్వారా నాణ్యమైన వైద్యసేవలను అందిస్తున్నారు.
డిజిటల్ ఎక్స్ రే ప్లాంట్లు, ఆల్ట్రాసౌండ్ స్కానర్లు, అనస్థీషియా మెషీన్లు, వెంటిలేటర్లు, సెమీ ఆటో అనలైజర్లు, ఆటోమేటిక్ మెకనైజ్డ్ లాండ్రీ, ఇనె్వంటర్లు, సోలార్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను రాష్ట్రంలో 20 వైద్యివిధాన పరిషత్ ఆసుపత్రుల్లో నెలకొల్పారు. దీనికి తోడు ఎనిమిదిచోట్ల కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, తాండూ రు, కింగ్‌కోఠి, జనగాం, సిద్దిపేటలో 150 పడకల ఆసుపత్రులను నెలకొల్పారు.
ఇక ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అంచనాలను తలకిందులు చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లడం మంచి పరిణామంగా పేర్కొనవచ్చు. ఈ ఆసుపత్రులకు 2017-18లో 1.61 కోట్ల మంది వైద్య సేవల నిమత్తం వెళ్లగా, 2018-19లో 1.63 కోట్ల మంది వెళ్లారు. వాస్తవానికి 1.28 కోట్ల మంది ఆసుపత్రులకు వస్తారని అంచనా వేయగా, గత ఏడాది 127 శాతం ఎక్కువగా 1.63 కోట్ల మంది వైద్య సేవలు పొందారు. ఇన్‌పేషంట్లుగా 2018-19లో 14.22 లక్ష ల మంది చేరారు. ఇక సర్జరీలు 1.19 లక్షల మంది చేయించుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కు టుంబ నియంత్రణ ఆపరేషన్లను విశే్లషిస్తే 2017-18 లో 1.08 లక్షల మంది, 2018-19లో 1.19 లక్షల మంది ఆపరేషన్లు చేయించుకున్నారు. ల్యాబ్ పరీక్షలను వి శే్లషిస్తే 2017-18లో 74.88 లక్షల మంది, 2018-19 లో 88.81 లక్షల మంది చేయించుకున్నారు.
ఔషధాల బడ్జెట్ కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. సామాజిక, ఆర్థిక అధ్యయనం ప్రకారం 2015-16లో 130.69 కోట్లు, 2016-17లో 240.9 కోట్లు, 2017-18లో 319.72 కోట్లు, 2018-19లో 517.66 కోట్లను కేటాయించి ఖర్చుపెట్టారు. కంటి వెలుగు కార్యక్రమం కింద ఇంతవరకు 1.54 కోట్ల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. 22.93 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. 1.04 కోట్ల మందికి నేత్ర సంబంధమైన సమస్యలు లేవని పేర్కొన్నారు.
బస్తీ దవాఖానాల కానె్సప్ట్ హిట్టయింది. తొలుత 115 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. 2019-20 నాటికి అదనంగా 132 దవాఖానాలను నెలకొల్పారు. ఐదు నుంచి పది వేల మంది వరకు జనాభా ఉండే ప్రతి బస్తీలో ఈ దవాఖానాలను ఏర్పాటు చేశారు. 2019-20లో ఇంతవరకు ఆరోగ్యశ్రీ కింద రూ.577.44 కోట్లను ఖర్చుపెట్టి అర్హులైన పేదలకు వైద్యసేవలు అందించారు.