తెలంగాణ

రాజ్యసభ, ఎమ్మెల్సీల ఖరారుపై సీఎం కేసీఆర్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజ్యసభ, శాసనమండలి అభ్యర్థుల ఎంపికకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. రాజ్యసభ, శాసనమండలికి రెండేసి ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ రెండింటికీ ఖరారు చేసిన అభ్యర్థులను బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ స్థానాల కంటే రాజ్యసభ స్థానాలకే పోటీ ఎక్కువగా ఉండడంతో ప్రధానంగా ఈ అభ్యర్థులపైనే కసరత్తు జరిగినట్టు సమాచారం. రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు పదవీకాలం తీరిపోనుండడంతో మళ్లీ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. రెండు స్థానాల్లో ఒక స్థానానికి తిరిగి కేశవరావుకు ఇవ్వడానికి సీఎం సుముఖంగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే రాజ్యసభ సభ్యుల్లో ఇప్పటికే ఇద్దరు బీసీలు ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన కేశవరావుకు మళ్లీ అవకాశం లభిస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. రెండో సీటు కోసం ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారామ్ నాయక్,
రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక సీఈవో ధికొండ దామోదర్‌రావు ఆశిస్తున్నారు. వీరిలో వినోద్‌కుమార్‌ను రాజ్యసభకు పంపించనున్నట్టు సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చినట్టు సమాచారం. అలాగే కల్వకుంట్ల కవితకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలు కూడా సీఎంపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చాక ఈ సీటు ఆశించిన వారికే ఎమ్మెల్సీలుగా సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.