తెలంగాణ

2 లక్షల మందికి ‘యశోదా’ మాస్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: కరోనావైరస్ నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా కార్పొరేట్ ఆసుపత్రి ‘యశోదా’ యాజమాన్యం రెండు లక్షల మాస్కులను అందిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌తో యశోదా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు, వైస్-ప్రెసిడెంట్ సురేష్ కుమార్ మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. రాష్ట్రం కరోనా బారిన పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యశోదా ప్రతినిధులు శ్లాఘించారు. తమ ఆసుపత్రి తరఫున రెండు లక్షల మాస్క్‌లను ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఒక లక్షా ఇరవైవేల మాస్కులను కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అందించారు. మరో 80 వేల మాస్కులను బుధవారం లోగా అందిస్తామన్నారు. ఇలా ఉండగా వెంటిలేషన్‌తో కూడిన 60 బెడ్లను తమ ఆసుపత్రిలో ‘ఐసోలేషన్ వార్డులు’గా ప్రత్యేకించామని జీఎస్ రావు, సురేష్ కుమార్ తెలిపారు. అవసరమైన పక్షంలో కరోనా అనుమానితులకు వీటిలో చికిత్స అందిస్తామన్నారు. సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో 20 బెడ్లు, మలక్‌పేటలోని యశోదా ఆసుపత్రిలో 20 బెడ్లు, సోమాజిగుడాలోని యశోదా ఆసుపత్రిలో మరో 20 బెడ్లను ప్రత్యేక వార్డులుగా గుర్తించామని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను ప్రతి గంటకు ఒక పర్యాయం శుభ్రం చేస్తున్నామని, ఎలాంటి వైరస్ లేకుండా చూసేందుకే శుభ్రత పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి తమ ఆసుపత్రి తరఫున ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని ఇద్దరు ప్రతినిధులు మంత్రి ఈటలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి చేయూత అందించేందుకు ముందుకు వచ్చిన యశోదా యాజమాన్యానికి అభినందిస్తున్నటుల మంత్రి ఈటల ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వానికి చేయూత ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.
*చిత్రం...యశోదా ఆసుపత్రి ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి ఈటల