తెలంగాణ

అప్రమత్తంగా ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నందు వల్ల తెలంగాణలో నేడు ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో, తెలంగాణ సరిహద్దులోని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండటం వల్ల తెలంగాణలో ‘కరోనా.. అలర్ట్’ అంటూ పిలుపు ఇచ్చామన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖలు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు పంచాయితీరాజ్, మున్సిపల్ వ్యవహారాలు, టూరిజం శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని కోణాల్లో చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలతో మన రాష్ట్రంలోకి వస్తే ఎవరైనా సరే బాధ్యత తీసుకుని 104 కు ఫోన్ చేసి సంబంధిత అనుమానితుల సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి వారిని ఐసోలేట్ చేసి చికిత్స ప్రారంభిస్తామని, అవసరమైన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌కు వివిధ దేశాల నుండి వచ్చిన 41,102 మంది ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని మంత్రి ఈటల తెలిపారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం నాలుగు థర్మో స్క్రీనింగ్ మిషన్లు ఉన్నాయని, మరో నాలుగింటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని నాలుగు రెట్లు పెంచి 200 మందితో రోజంతా స్క్రీనింగ్ కొనసాగిస్తామన్నారు. కరోనా అనుమానంతో 277 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు, స్వాబ్ టెస్టులు చేశామన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లాబోరేటరీలోనే ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించామని, తాజాగా ఉస్మానియా ఆసుపత్రిలో కూడా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతించిందన్నారు.
అందువల్ల ఉస్మానియాలో కూడా లాబోరేటరీ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గ్రామ పంచాయితీ వరకు సిబ్బంది, అధికారులకు కరోనాపై అవగాహన కల్పించామని మంత్రి తెలిపారు.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్