తెలంగాణ

రాజ్యసభ సీటుపై సమాచారం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: రాజ్యసభ సీటుపై తనకు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం శాసనసభకు వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. అనంతరం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. రాజ్యసభకు ఖాళీ కానున్న రెండు స్థానాలలో ఒక స్థానానికి ఎంపీ కేశవరావు, మరో స్థానానికి పొంగులేటి
శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వాలు ఖరారైనట్టు టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను కలవడం ఈ సమాచారానికి మరింత బలం చేకూరింది. ఇలాఉండగా శాసనమండలికి ఖాళీ అయిన రెండు స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు తెలిసింది. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ ఎంపికైనట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని అసెంబ్లీ లాబీల్లో దేశపతి శ్రీనివాస్‌ను కలిసిన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు.
ఇలాఉండగా రాజ్యసభకు నామినేషన్ల దాఖలుకు శుక్రవారం గడువు ముగియనుండడంతో టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను గురువారం ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యసభకు ఖాళీ అయిన రెండు స్థానాలను గెలుచుకోవడానికి టీఆర్‌ఎస్‌కు పూర్తి బలం ఉండడంతో ఎంపిక చేసిన అభ్యర్థుల ఎన్నిక లాంఛనప్రాయమే కానుంది.

*చిత్రం...బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్న రాజ్యసభ సీటును ఆశిస్తున్న కే కేశవరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు