తెలంగాణ
2,500 కాలేజీల్లో సేఫ్ట్టీ క్లబ్‌లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: నేరం చేస్తే ఎంతటివారికైనా శిక్ష పడుతుందన్న భావనను సృష్టించడంలో తెలంగాణ పోలీసు శాఖ సఫలమైందని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థినులు, మహిళల భద్రత కోసం తొలి దశగా రాష్ట్రంలోని 2,500 కాలేజీల్లో సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర పోలీ సు శాఖలోని మహిళా భద్రత విభా గం ఆధ్వర్యంలో
బుధవారం ఇక్కడి ఆర్టీసీ కల్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిందితులకు శిక్షలు గణనీయంగా పడ్డాయని వివరించారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన మూడు ప్రధాన కేసులకు సంబంధించి న్యాయస్థానాల ద్వారా శిక్షను ఖరారు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో కన్విక్షన్ రేటు 300 శాతం నుంచి 400 శాతానికి పెరిగిందని ఆయన వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఆరు లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని, ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా వెంటనే నిందితులను పట్టుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని ఆయన వివరించారు. పోలీసింగ్ అనేది కేవలం పోలీసులతోనే సాధ్యం కాదని, ఈ విషయంలో ప్రజలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్‌ల పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారని ఆయన తెలిపారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ లింగ వివక్షకు వ్యతిరేకంగా పాఠ్యాంశాలను కాలేజీ స్థాయిలో ప్రవేశపెట్టిన ఘనత మన రాష్ట్రానిదేనని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో విద్యార్థినీ విద్యార్థులు సభ్యులుగా సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆలోచన పోలీసు శాఖదే అయినా సమాజంలో సుదీర్ఘకాలంగా గొప్ప మార్పుకు అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ఆలోచనా ధృక్పథంలో మార్పు వచ్చినపుడే సామాజిక మార్పు సాధ్యమవుతుందని మిట్టల్ అన్నారు. దీనికి ఈ సేఫ్టీ క్లబ్‌లు దోహదపడతాయని వివరించారు. మహిళా భద్రత ఐజీ స్వాతిలక్రా మాట్లాడుతూ రాష్ట్రంలోని 2,500 కాలేజీల్లో సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేసి, ఇందులో లక్ష మందిని సభ్యులుగా చేర్చించి, వీరి సేవలను మహిళలు, పిల్లల భద్రత కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు ఏర్పాటు చేసిన షీ టీమ్‌లు, ఎన్‌ఆర్‌ఐ సెల్, భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలో మరో పది కొత్త భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ వలంటీర్లకు అవగాహన చైతన్యంపై చోటా భీమ్‌తో రూపొందించిన యానిమేషన్ వీడియో చిత్రాలను డీజీపీ విడుదల చేశారు. సేఫ్టీ క్లబ్‌లపై ఏర్పాటు చేసిన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ప్రారంభించారు.
*చిత్రం...హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్ రెడ్డి