తెలంగాణ

ఏప్రిల్ 8 వరకూ గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర విధానాన్ని తీసుకువచ్చేందుకు, కౌంటర్ దాఖలుకు రాష్ట్ర హైకోర్టు వచ్చే నెల 8 వరకూ గడువు విధించింది.
ఇందుకు సంబంధించి దాఖలైన ప్రజావాజ్య పిటిషన్లు (పిల్ 4/2016, పిల్ 149/2016, రిట్ 1331/2018)పై తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీన చేపట్టనుంది. హైకోర్టు గడువు విధించడంతో ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజులపై నిర్ధిష్ట విధానాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నట్టు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రొఫెసర్ టీ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.