తెలంగాణ

వైసీపీ శ్రేణుల దాడులో గాయపడిన న్యాయవాదికి నల్లగొండలో చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 11: ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన హైకోర్టు న్యాయవాది పి.కిషోర్ నల్లగొండ పట్టణంలోని నవ్య ఆసుపత్రిలో చికిత్స పొందారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాలతో కలిసి ఆయన పోతలవీడు స్థానిక సంస్థల ఎన్నికల వివాదంపై టీడీపీ నాయకులతో చర్చించేందుకు వెళుతుండగా, మాచర్చ రింగ్‌రోడ్డు సెంటర్‌లో వారిపై వైసీపీ శ్రేణులు కర్రలతో దాడులు చేశారు. వారి వెంట ఉన్న న్యాయవాది కిషోర్ కారుపై కూడా దాడి జరిగింది. అయితే దాడి నుండి తప్పించుకునే క్రమంలో బుద్దా వెంకన్న, బొండ ఉమల కారు గుంటూరు వైపు వెళ్లిపోగా, పి.కిషోర్ కారు మాచర్ల మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది. వారి కారును కూడా పదిహేను కిలోమీటర్లకుపైగా వెంబడించినట్టు కిషోర్ తెలిపారు. దాడిలో కిషోర్ తలకు గాయాలవ్వగా అతని దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. కారు అద్దాలు ధ్వంసమవ్వగా లోపల వారి కూర్చున్న సీట్లు రక్తంతో తడిశాయి. కిషోర్ నల్లగొండ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా ఆయనను స్థానిక టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ పరామర్శించారు. చికిత్స అనంతరం కిషోర్ తిరిగి గుంటూరు వెళ్లిపోయారు.
*చిత్రం... వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి, నల్లగొండ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది పీ కిషోర్