తెలంగాణ

కార్పొరేటర్ నుంచి రాష్ట్ర కమల దళపతిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయ. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి సంజయ్ ఎంపీగా గెలుపొందారు. బండి నర్సయ్య-శకుంతల దంపతులకు 11-7-1971లో సంజయ్ జన్మించారు. ఆయన సతీమణి అపర్ణ ఎస్‌బిఐలో ఉద్యోగిని కాగా, సంజయ్‌కు సాయి భగీరథ్, సాయి సుముఖ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో పనిచేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్‌గా, ఉపాధ్యక్షునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో 1994-99, 1999-2003లో డైరెక్టర్‌గా, దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఇన్‌చార్జిగా పని చేశారు. ఇదే విధంగా భారతీయ జనతామోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ, కేరళ, తమిళనాడు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు చేపట్టారు. ఎల్.కె.అద్వానీ చేపట్టిన సురాజ్ రథయాత్రలో వెహికిల్ ఇన్‌చార్జిగా, కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడిన తరువాత 48వ డివిజన్ కార్పొరేటర్‌గా 2005 మొదటిసారి విజయం సాధించిన ఆయనవరుసగా మూడుసార్లు నెగ్గి హ్యాట్రిక్ సైతం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి 52 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో తిరిగి మళ్లీ ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 66,009 ఓట్లతో మరోసారి రెండో స్థానంలో నిలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి టీఆర్‌ఎస్ కంచుకోటను బద్ధలు కొట్టి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2020 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులవ్వడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయ.
*చిత్రం... కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్