తెలంగాణ

పాలమూరు ప్రాజెక్టు భూ నిర్వాసితుల కోసం కాంగ్రెస్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 11: పాలమూరు ఎత్తిపోతల పథకం భూనిర్వాసితుల హక్కులసాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. గత పదిహేనురోజులుగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ భూనిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని వల్లూర్ గ్రామంలో భూనిర్వాసితులు దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలు వారికి సంఘీభావంగా దీక్షా శిబిరం దగ్గరకు వచ్చి అండగా ఉంటామని హామీ ఇస్తూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అయితే బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, పీసీసీ కార్యదర్శి అనిరుధ్‌రెడ్డితో పాటు వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వల్లూర్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడినుండి మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే వల్లూర్ నుండి దాదాపు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలోనే నవాబుపేట మండలం తీగలపల్లి సమీపంలో వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసుల మధ్య తీవ్రవాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది.
అయితే పోలీసులు పాదయాత్ర ప్రారంభించక ముందే టీపీసీసీ కార్యదర్శి అనిరుధ్ రెడ్డిని ఆరెస్టు చేయడానికి వేసిన వ్యూహాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఛేదించి ఒక్కసారిగా వందలాది మంది కార్యకర్తల మధ్య భారీ కాన్వాయ్‌తో ఉదండాపూర్ నిర్వాసితులు చేపట్టిన దీక్షా శిబిరం దగ్గరకు చేరుకుని అక్కడి నుండి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పరిస్థితులు పోలీసులకు అనుకూలంగా లేకపోవడంతో మహబూబ్‌నగర్‌కు వెళ్లే రహదారిలో పోలీసులు పాదయాత్రను అడ్డుకుని కాంగ్రెస్ నేత అనిరుధ్‌రెడ్డిని ఆరెస్టు చేసి అడ్డాకుల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆరెస్టు చేస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ దశలో పోలీసులపైకి కాంగ్రెస్ నాయకులు తిరగబడటంతో పోలీసులు ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి ఆరెస్టులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ వల్లూర్, ఉదండాపూర్ గ్రామాల నిర్వాసితులను ప్రభుత్వం మోసం చేసిందని ఇతర గ్రామాల్లో ఎకరాకు రూ.12 లక్షలు పరిహారం ఇస్తూ ఈ గ్రామాల నిర్వాసితులకు తక్కువ పరిహారం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం జరగాలనే డిమాండ్‌తో వారి హక్కును కాపాడాలనే డిమాండ్‌తో తాము కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కానీ పోలీసులు ఆరెస్టులు చేయడం దురదృష్టకరమని ప్రభుత్వం భూనిర్వాసితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పోరాటం అగదని భూనిర్వాసితులకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. కాగా ఈ పాదయాత్రకు జడ్చర్ల నియోజకవర్గంలోని పలు మండలాల కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*చిత్రాలు.. ఉదండాపూర్ రిజర్వాయర్ భూనిర్వాసితులు చేపట్టిన దీక్షా శిబిరంలో కాంగ్రెస్ నేతలు,
*మహబూబ్‌నగర్ జిల్లా తీగలపల్లి సమీపంలో కాంగ్రెస్ నేతల పాదయాత్రను అడ్డుకుని పీసీసీ కార్యదర్శి అనిరుధ్ రెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు