తెలంగాణ

కరీంనగర్ ఆసుపత్రిలో కూలిన శ్లాబ్ పైపెచ్చులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 23: జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు భద్రత కరువైంది. శనివారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని పిల్లల వార్డులో ఒక్కసారిగా భవనం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటనలో ఒక చిన్నారి, ఆమె తల్లిదండ్రులతోపాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో జరిగిన ఈ ఘటన రోగులను భయాందోళనకు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేశవపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన ఆడెపు వేణుగోపాల్- మమత అనే దంపతులు వారి ఐదు నెలల కుమార్తె (ఇంకా పేరు పెట్టలేదు)కు జ్వరం రావడంతో మూడు రోజుల కిందట జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో చేర్పించారు. అప్పటినుంచి చిన్నారితోనే వారు కూడా పిల్లల వార్డులోనే ఉంటున్నారు. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా శ్లాబ్ పైపెచ్చులు పిల్లల వార్డులో పడగా, పిల్లల వార్డులో ఉన్న చిన్నారి, వేణుగోపాల్, మమతతోపాటు కొంకటి రాజు అనే మరోక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఆసుపత్రికి చేరుకుని పైపెచ్చులు ఊడిన పిల్లల వార్డును సందర్శించి పరిశీలించారు. గాయపడిన వారిని పరామర్శించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా మరమ్మతులు చేపట్టాలని ఆమె వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం అదనపు జెసి నాగేంద్ర ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు.