తెలంగాణ

మరో 14 మంది అనుమానితులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సికిందరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన బాధితుడికి గాంధీ ఆసుపత్రికి వ్యాధి నయం చేసి డిశ్చార్జి చేసి ఇంటికి పంపిన ఇరవై నాలుగు గంటల్లోనే మరో పాజిటివ్ కేసు వచ్చింది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తికి అనుమానిత లక్షణాలుండడంతో అతనిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఎయిర్‌పోర్టు నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతనితో పాటు ఖమ్మంకు చెందిన 24 ఏళ్ల యువతికి సైతం వ్యాధి నిర్ధారణ కావడంతో వారిద్దరికీ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు కరోనా నోడల్ కేంద్రం ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అనుమానిత లక్షణాలతో మరో 14 మంది శనివారం గాంధీ ఆసుపత్రికి వచ్చారని, వారిని కూడా
ఐసోలేషన్ వార్డులో చేర్చుకుని తగిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పడకల పెంపునకు ఏర్పాట్లు
రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిని కరోనా నోడల్ కేంద్రంగా ప్రకటించిన తర్వాత 36 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు పడకల సంఖ్యను 150కి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. 8వ అంతస్తులో ప్రస్తుతం నర్సింగ్ ట్రెయినింగ్ సెంటర్ ఉందని, దాన్ని భోలక్‌పూర్‌లోని నర్సింగ్ హాస్టల్‌కు తరలించి, దాని స్థానంలో అదనపు పడకలతో కరోనా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.