తెలంగాణ

అదనంగా 6.62 లక్షల మందికి ఆసరా పెన్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా మరో 6.62 లక్షల మందికి ఆసరా పెన్షన్లను ఇవ్వనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శనివారం నాడు శాసనసభలో చల్లా ధర్మార్డె, కాలే యాదయ్య, కోరుకంటి చందర్, గుర్మ జైపాల్ యాదవ్ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ఆసరా పింఛన్లకు ప్రభుత్వం ఇంత వరకూ 27,868.99 కోట్లు నిధులు ఖర్చు చేస్తోందని అన్నారు. 2014 నవంబర్‌లో ఆసరా పింఛన్లను ప్రవేశపెట్టామని, ఆ సమయానికి 27.38 లక్షల పెన్షన్లు ఉండగా 2020 నాటికి అది 38.72 లక్షలకు పెరిగిందని చెప్పారు. వృద్ధాప్య పింఛన్ల కేటగిరి కింద పింఛను పొందేందుకు వృద్ధాప్య పింఛను వయోపరిమితిని 57 సంవత్సరాలకు తగ్గిస్తామని గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని మంత్రి చెప్పారు. 2014-15లో 1972.62 కోట్లు, 2015-16లో 3066.34 కోట్లు, 2016-17లో 4438.82 కోట్లు, 2017-18లో 5301.83 కోట్లు, 2018-19లో 5173.29 కోట్లు, 2019-20లో జనవరి నెల వరకూ 7917.09 కోట్లు ఖర్చుచేశామని పేర్కొన్నారు. ప్రతి నెలా 879 కోట్లు పెన్షన్లకు వెచ్చిస్తున్నామని చెప్పారు. పెన్షన్లు పొందుతున్న వారిలో ఎస్సీలు ఆరున్నర లక్షలు, ఎస్టీలు 3.22 లక్షలు, బీసీలు 21.83 లక్షలు, మైనార్టీలు 2.90 లక్షలు, ఇతరులు 4.40 లక్షలున్నారని పేర్కొన్నారు. బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో ఉన్న ఇబ్బందులను కూడా తొలగిస్తామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం పెన్షన్లకు కేవలం 203 కోట్లు ఇస్తోందని, కేంద్రం తమ వాటాను పెంచితే మంచిదేనని అన్నారు.