తెలంగాణ

గొర్రెల కాపరులకు శుభవార్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తున్నామని, ఈ విషయం గొర్లకాపన్లకు సుభవార్త అంటూ రాష్ట్ర పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం శాసనసభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బడ్జెట్ పద్దుల అంశంపై మాట్లాడుతూ వచ్చే జూన్‌లో రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గొర్రెల కాపరులు దాదాపు 28వేల మంది డీడీలు కట్టారని మంత్రి గుర్తు చేశారు. గొర్రెలు (జీవాలు) కోసం బీమా చెల్లించడానికి ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుందన్నారు. గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. గొర్రెలకు వ్యాధులు వచ్చినప్పుడు వాటిని ఆసుపత్రికి తరలించడానికి మోబైల్ వాహనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. గోశాలను సైతం ఏర్పాటు చేశామన్నారు. నోరులేని జీవాల కోసం వాటిని గుర్తించడానికి ఆధార్ కార్డులు సైతం మంజూరు చేశామన్నారు. విజయాడైరీని మరింత అభివృద్ధి చేయడానకి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పాల సేకరణ కోసం 4 రూపాయలను ప్రోత్సాహంగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో 2.13 కోట్ల మంది పాడిరైతులు ఉన్నాన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపకానికి నిధుల కొరత లేకుండా చూస్తానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని మంత్రి ప్రకటించారు.