తెలంగాణ

పరీక్షలు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూలులో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ అధికారులు శనివారం రాత్రి పేర్కొన్నారు. ప్రాధమిక పాఠశాలలు, ప్రాధమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించినా పరీక్షల షెడ్యూలులో మార్పులు లేవని వారు చెప్పారు. ఇంటర్ పరీక్షలు 4వ తేదీనే మొదలయ్యాయని, శనివారం నాడు ఫస్టియర్ ఫిజిక్స్ , ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజి పేపర్లు ముగిశాయి. సోమవారం నాడు సెకండియర్ విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్ష జరుగుతాయి. 17న ఫస్టియర్, 18న జరిగే సెకండియర్ పరీక్షలతో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు ముగుస్తాయని 19న ఫస్టియర్‌కు జియాలజీ, హోం సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు, 20న సెకండియర్‌కు జియాలజీ, హోం సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , లాజిక్, బ్రిడ్జి కోర్సు పరీక్షలుంటాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యూయేషన్ ప్రారంభమైంది. కాగా టెన్త్ పరీక్షలు మార్చి 19న ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 6 వరకూ కొనసాగుతాయి. మార్చి 19 ఫస్టు లాంగ్వేజి పేపర్-1, 20న ఫస్టు లాంగ్వేజి పేపర్-2, 21న సెకండ్ లాంగ్వేజి, 23న ఇంగ్లీషు-1, 24న ఇంగ్లీషు-2, 26న మాథ్స్-1, 27న మాథ్స్-2, 28న జనరల్ సైన్స్-1, 30న జనరల్ సైన్స్ -2, 31న సోషల్-1, ఏప్రిల్ -1న సోషల్-2 పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 3న ఒఎస్సెస్సీ-1, ఏప్రిల్ 4న ఒఎస్సెస్సీ -2, ఏప్రిల్ 6న ఎస్సెస్సీ వొకేషనల్ పరీక్షలు జరుగుతాయి.