తెలంగాణ

అసలు కరోనా కేసీఆరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చడం దారుణమని, అసలు కరోనా ఆయనేనని, కాంగ్రెస్ దేశానికి కన్నతల్లి లాంటిదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కరోనాతో పోల్చడం కేసీఆర్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. పారాసిట్‌మాల్ గోలీతో కరోనా
తగ్గిపోతోందని అన్న కేసీఆర్‌కు ప్రజారోగ్యంపైన చిత్తశుద్ధి లేదన్నారు. అసెంబ్లీలో శనివారం కరోనా వైరస్‌పై చర్చలో ముఖ్యమంత్రి సంయమనం కోల్పోయి మాట్లాడారని, కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్‌ను దూషించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా హడలెత్తిస్తుంటే, ఇది చాలా చిన్న సమస్య అని, తెలంగాణలో రాదని, ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని కేసీఆర్ చెప్పడం దారుణమన్నారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. అసెంబ్లీ రికార్డుల నుంచి ఆ మాటలను తొలగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలన్నారు.

*చిత్రం... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి