తెలంగాణ

టీఆర్‌ఎస్ గడీలను కూల్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని, టీఆర్‌ఎస్, ఎంఐఎం విధ్వంసకాండను నిలువరిస్తామని బీజేపీ రాష్ట్ర కొత్త రథసారథి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ‘యుద్ధం ప్రారంభమైంది. కేసీఆర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం రెపరెపలాడుతుంది’ అని అన్నారు. ఆదివారం ఇక్కడ బీజేపీ కార్యకర్తలు, నేతలు కొత్త అధ్యక్షుడు బండి సంజయ్‌కు బ్రహ్మరథం పట్టారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇక్కడి పార్టీ ఆఫీసు వరకు బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం జరిగిన స్వాగత సభలో ఆయన మాట్లాడుతూ జాతీయవాదమే ఊపిరిగా అందరితో కలిసి పనిచేశానన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అండదండలతో ఈ స్థాయికి ఎదిగానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా భయం కాదని, కమలం భయం పట్టుకుందన్నారు. ఎంతోమంది ఉగ్రవాదుల చేతుల్లో జాతీయవాదులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. గోల్కొండ కోటపై కాషాయ
జెండాను రెపరెపలాడిస్తానన్నారు. కేంద్రం వద్దకు వచ్చే దమ్ము కేసీఆర్‌కు ఉందా? వస్తే నిధులు ఇప్పించే దమ్ము తనకు ఉందన్నారు. మతతత్వ పార్టీ అంటూ హిందువులపై అరాచకం, అక్రమ కేసులు పెడితే ‘ఖబడ్దార్ కేసీఆర్.. నీ గుండెల్లో నిద్రపోతానన్నారు. హిందుత్వ మూల సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతమన్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ఇటీవల జరిగిన ఒక సంఘటనలో చిన్నపిల్లలు, మహిళలు, తమ్ముళ్లూ కాపాడండి.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసిన ఘటన ఇంకా తన కళ్ల ముందు కదలాడుతోందన్నారు. మళ్లీ భైంసాకు వస్తానని ఆయన అన్నారు. ‘నేను ఇంట్లో కూర్చోను. జనంలోకి వస్తా, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా’ అని కొత్త అధ్యక్షుడు సంజయ్ అన్నారు. కేసీఆర్ యాగాలు చేసేది తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయడానికేనన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు లెక్కలు కేసీఆర్ చెప్పాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, రైతులకు రుణమాఫీ లేదన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కొద్దిరోజుల కిందట జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులను రక్తం వచ్చే విధంగా పోలీసులు కొట్టారన్నారు. కేసీఆర్‌కు మానవత్వం లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని ఆయన అన్నారు. త్వరలో టీఆర్‌ఎస్ గడీలను కూల్చేస్తామన్నారు. మైనారిటీ ఓటు బ్యాంకు ద్వారా రాష్ట్రాన్ని ఏలాలని చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించుతామన్నారు. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదన్నారు. కేసీఆర్ కరోనాకు పారాసిట్‌మాల్ మాత్ర విరుగుడు అని చెప్పడం చూసి దేశం మొత్తం నవ్వుకుంటోందన్నారు. త్వరలో రాష్టమ్రంతటా పాదయాత్ర నిర్వహిస్తానని, రథయాత్ర చేస్తానని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ గ్రామానికీ, మండలానికీ వస్తానన్నారు. అధికార పార్టీ వైఖరికి నిరసనగా ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు చేసే పోరాటంలో విజయమో, వీరస్వర్గమో తేల్చుకుంటామన్నారు. బీజేపీ కార్యకర్తలు శివాజీ వారసులైతే, ఎంఐఎం కార్యకర్తలు ఔరంగజేబు వారసులన్నారు. ఈ సభలో బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి, పార్టీ నేతలు డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు.

*చిత్రాలు.. బీజేపీ రాష్ట్ర కొత్త సారథిగా ఎంపికైన తర్వాత ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్ కుమార్
*హాజరైన పార్టీ శ్రేణులు (ఇన్‌సెట్‌లో)