తెలంగాణ

కందుల కొనుగోలుకు రివాల్వింగ్ ఫండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలుకు వెంటనే రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం ఇక్కడ ఆయన పంటల గిట్టుబాటు ధరలు, రైతాంగ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు, అవగాహన లేని కారణంగానే కంది రైతులకు నష్టం కలిగిందన్నారు. రూ.879 కోట్లతో కంది ఉత్పత్తిలో 25 శాతానికి మించి అదనంగా లక్ష టన్నుల కందులను కొంటున్నామన్నారు. కందులు, పత్తి కొనుగోలుపై అధికారులతో రైతులతో చర్చించామన్నారు. ఈసారి అత్యధిక కందుల కొనుగోలు విషయంలో కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. రైతులకు
మద్దతు ధర ఇస్తున్నా, దళారుల ప్రమేయం వల్ల రైతులకు అందడం లేదన్నారు. దళారులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కందుల ఉత్పత్తి అంచనా మేరకు 25 శాతం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 51 వేల 625 టన్నుల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. రూ.266 కోట్ల నాఫెడ్ ద్వారా మార్క్‌ఫెడ్‌కు నిధులు బదలాయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఒక టన్ను కందులు కూడా కొనుగోలు చేయలేదన్నారు. ఇంతవరకు కేంద్రం 65 వేల టన్నుల కందులను కొనుగోలు చేసిందన్నారు.
ఇదిలావుంటే, కరోనాపై ఆందోళన కంటే స్వీయ శుభ్రత, జాగ్రత్త చర్యలు ఎంతో అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనాపై సోమవారం జరిగే పార్లమెంటు సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల చైనా మనకు సరిహద్దు దేశమైనా కరోనా తీవ్రత లేదన్నారు. కరోనా నివారణకు మందులను తయారు చేస్తే ఆయా కంపెనీలకు పన్నులు లేకుండా ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి