తెలంగాణ

టి.టిడిపి నేతలతో లోకేశ్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: తెలంగాణలోని అన్ని జిల్లాల, మండల స్థాయి పార్టీ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి, ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ నాయకులకు సూచించారు. శనివారం టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో, ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశానికి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను చేరదీయాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా తొలుత పార్టీ జిల్లా, మండల స్థాయి కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ స్థాయిల్లో ఉన్న కమిటీల్లో ఎక్కడైనా ఖాళీలు ఉంటే వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించవచ్చని ఆయన చెప్పారు. భవిష్యత్తు మనదేనన్న భరోసా పార్టీ శ్రేణులకు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.