తెలంగాణ

సీఎం భాష దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉపయోగించిన భాష చాలా దారుణంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ ఆరోపించారు. ఐదేళ్లలో కేసీఆర్ అన్ని వర్గాలనూ మోసం చేశారని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఎన్నడూ ఇవ్వలేదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాకుండా అప్పుల తెలంగాణగా మారిందని చెప్పారు. భైంసాలో జరిగిన హింస గుర్తులేని కేసీఆర్‌కు ఢిల్లీ ఘటనలు ఎలా గుర్తున్నాయని ప్రశ్నించారు. 80వేల పుస్తకాలను చదివిన కేసీర్ 10 పేజీల సీఏఏ బిల్లును చదవలేదా అని రాజాసింగ్ ప్రశ్నించారు. సీఏఏ వల్ల దేశంలో ఏ ఒక్క వర్గానికీ ఇబ్బంది లేదని అన్నారు. ఎన్నార్సీపై ప్రస్తుతం చర్చ జరగడం లేదని, దానిని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నార్సీ అనేది ఈ రోజు కొత్తగా జరుగుతున్న ప్రక్రియ కాదని చెప్పారు.