తెలంగాణ

రక్తం ఎక్కించుకునేందుకు వస్తే.. ప్రసవం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, మార్చి 17: వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు...కానీ గాంధీ ఆసుపత్రి వైద్యులను నమ్ముకుంటే ప్రాణాలు హరీమనేలా ఉన్నాయి. శరీరంలో ప్లేట్‌లెట్స్ తక్కువున్నాయని, తాముంటున్న చోట రక్తం దొరకటం కష్టం కావటంతో నగరంలోని గాంధీ ఆసుపత్రికి వస్తే ఏకంగా ప్రసవం చేశారు. వైద్య వర్గాలు తలదించుకునే ఈ ఘటన గాంధీ ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఒకరికి చేయాల్సిన శస్తచ్రికిత్స మరొకరికి చేసి గాంధీ ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. నెలలు నిండిన గర్బిణికి చేయాల్సిన ఆపరేషన్ 7 నెలల గర్బిణికి చేయడంతో శిశువు మృతి చెందగా, ఆ బాలింత మృత్యువుతో పోరాడుతోంది. బాధితురాల సంబంధీకుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌కు చెందిన సమత(24) అనే ఏడు నేలల గర్బిణికి ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండడంతో అక్కడ ఓ నెగెటీవ్ గ్రూప్ రక్తం దొరకడం కష్టమని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించగా, 11న గాంధీ అసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. 12వ తేదీన కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఉదయం ఆపరేషన్ వార్డులోకి తీసుకెళ్లి, సాయంత్రం ఆపరేషన్ చేసి, మగశిశువు జన్మించాడని, ఐసీయూలో పెట్టామని చెప్పినట్లు తెలిపారు. డాక్టర్ల ఆదేశాల మేరకు తాము రక్తం తీసుకొచ్చేందుకు వెళ్లి, తిరిగొచ్చే సరికి వచ్చేసరికి ఇదంతా జరిగిపోయిందని సమత భర్త వెల్లడించారు. మూడురోజుల తర్వాత 15వ తేదీన శిశువును కాపాడలేకపోయామంటూ శిశువు మృతదేహాన్ని తమకు ఇచ్చారని వాపోయారు. ఆ శిశువు చేతికి, తమకిచ్చిన స్లిప్‌లోనూ ఫీమేల్ అని రాసి ఉండటాన్ని గమనించినట్లు తెలిపారు. శిశువేమో మగ శిశువు కావటంతో తాము ఆశ్చర్యపోయామని తెలిపారు. అది చిన్న పొరపాటున అలా జరిగిందంటూ, మళ్లీ ఫీమేల్‌ను మేల్‌గా దిద్దారని వెల్లడించారు.
తప్పించుకునేందుకు దిద్దేశారు
తమ బిడ్డే చనిపోయాక చేసేదేముందని తాను బాధపడుతున్న సమయంలో బాలింత సమత చేతికి భవానీ పేరుతో ట్యాగ్ ఉండడంతో అనుమానం వచ్చి వైద్యులను ప్రశ్నించగా, చిన్న పొరపాటు జరిగిందంటూ దిద్దేశారని వివరించారు. భవానీ అనే గర్బిణికి చేయాల్సిన ఆపరేషన్ సమతకు చేశారని, అంతటితో ఆగని వైద్యులు ఆమెకు చేయాల్సిన ఇతర పరీక్షలు, చికిత్సలు సమతకే చేయటం వల్ల ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతోందని వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి భర్త హరీశ్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై వాస్తవాలను వెలికితీసేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రావణ్‌కుమార్ ఓ కమిటీని నియమించినట్లు సమాచారం.