తెలంగాణ

భూములను తీసుకొని రైతులకే అన్యాయం చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, మార్చి 17: లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) ప్రాజెక్టు కింద బ్యాక్ వాటర్‌తో సూరారం నుండి మహదేవ్‌పూర్ వరకు 200 ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని లక్ష్మీ బ్యారేజీ బ్యాక్ వాటర్ వల్ల నీట మునిగిన పంటలను పరిశీలించారు. బ్యారేజీకి భూములు ఇచ్చిన సూరారం రైతులతో చర్చించారు. అనంతరం ఆయన రైతులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ కరకట్ట వెంట నష్టపోయిన పంటలను పరిశీలించారు. ముందస్తుగా కరకట్టకన్న వాగులు ఒర్రెల చెరువుల న్లీను కాలువలు కట్టి బ్యారేజీ కిందకు నీటిని మళ్లించినట్టయితే రైతులకు నష్టం జరిగేది కాదన్నారు. ఈ విషయంపై రైతులు మాట్లాడితే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కోదండరాం వస్తున్నాడన్న సమాచారంతో కాటారం డీఎస్పీ బోనాల కిషన్ అక్కడికి చేరుకుని ముందస్తు సమాచారం లేదని, వెనక్కి తిరిగి వెళ్లాలని కోదండరాంను కోరారు. తాను రైతుల కోరిక మేరకు వారి సమస్యలను తెలుసుకొని వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వాన్ని కోరుతానని పోలీసులకు వివరించారు. కరోనా వైరస్ వల్ల ఇంత మంది తిరగడానికి పర్మిషన్ లేదని, ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాలని వారిని కోరారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి అవలంబించడం సరైందికాదనాన్నరు. బ్యాక్ వాటర్ వల్ల పంటలు నష్టపోయిన రైతులకు గుంటకు వంద రూపాయలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారన్న విలేకర్ల ప్రశ్నకు కోదండరాం సమాధానమిస్తూ బ్యారేజీ కోసం భూములు కోల్పోయిన రైతులతో గ్రామంలో గ్రామసభ నిర్వహించి రైతుల డిమాండ్ పరిగణలోనికి తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని ఆయన అన్నారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని సూచించారు. లక్ష్మీ బ్యారేజీకి భూములు కోల్పోయిన రైతులతో పాటు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని, లేనిపక్షంలో తమ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీజేఎస్ జిల్లా ఇన్‌చార్జ్ చాప బాబుదొర, జిల్లా యూత్ అధ్యక్షులు రత్నం కిరణ్, వరంగల్ అర్బన్ అధ్యక్షులు చిల్ల రాజేంద్రప్రసాద్, మహదేవ్‌పూర్ మండల అధ్యక్షులు బుర్రి శివరాజు, నాయకులు శ్రీ్ధర్, తిరుపతి, ఎండీ హమీద్ తదితరులు పాల్గొన్నారు.