తెలంగాణ

బాల కార్మిక చట్టం మరింత కఠినతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: పార్లమెంటులో ఆమోదం పొందబోతున్న బాల కార్మిక చట్టాన్ని మరింత కఠినతరం చేశామని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రాజ్యసభలో ఆమోదం పొందిన బాల కార్మిక సవరణ బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో వ్యక్తం చేశారు. 14 సంవత్సరాల వయస్సులోపు బాలలు ఎక్కడా పని చేయకుండా నిషేధం విధించేందుకు ఈ బిల్లులో సవరణకు ప్రతిపాదించామని చెప్పారు. 14 ఏళ్ల లోపు బాలలను పనికి పెట్టుకున్నట్లయితే ఆ సంస్ధ యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్లు ఆయన తెలిపారు. 18 ఏళ్ళలోపు బాలలు ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో పని చేయరాదని ఆయన సూచించారు. అయితే వారి తల్లిదండ్రులు, చెల్లి, అక్క, సోదరులకు చెందిన కంపెనీలైతే సహాయకులుగా ఉండవచ్చని చెప్పారు. తద్వారా వారికీ విషయపరిజ్ఞానం ఏర్పడుతుంది కాబట్టి అనుమతించినట్లు ఆయన వివరించారు. వారైనా పాఠశాల, కళాశాల సమయాలు పూర్తయిన తర్వాతే వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బాల కార్మికులతో ఎవరైనా పని చేయిస్తే విధించే 20 వేల జరిమానాను తాము 50 వేలకు పెంచుతూ బిల్లులో సవరణ ప్రతిపాదించామని ఆయన తెలిపారు. లోగడ 6 నెలల నుంచి రెండేళ్ళ వరకు ఉన్న శిక్షా కాలాన్ని తాము మూడేళ్ళకు పెంచామని ఆయన చెప్పారు. వచ్చే వారం లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 165 కోట్ల రూపాయలు విడుదల చేసిందని దత్తాత్రేయ తెలిపారు.