తెలంగాణ

వడగళ్ల వానతో పంటలకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: రాష్ట్రంలో వడగండ్ల వానల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులను సీఎం కేసీఆర్ ఆదుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. చేతికి వచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు తల్లడిల్లుతున్నారన్నారు. తక్షణమే రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో యాదగిరిగుట్ట, బొమ్మల రామారాం, తుర్కపల్లి, రాజ్‌పేట్ మండలంలో పంటలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. సుమారు 50 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు వరి పంట, మామిడి, నిమ్మ తోటలు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్ల్దిన్నారు. పశువులకు పశుగ్రాసం లేకుండా నేలమట్టమైందన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు చేతి కందే పంట నష్టపోవడం వల్ల రైతు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయన్నారు. రైతులకు ఎకరాలకు రూ.20వేలు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పంట నష్టం చెందిన ప్రాంతాలను వ్యవసాయ శాఖ మంత్రి , అధికారులు, కలెక్టర్లు ఆ ప్రాంతాలను సందర్శించాలన్నారు. వెంటనే పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలరన్నారు. రైతులకు వెంటనే రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలవాలన్నారు. బీమా కంపెనీల పైన ప్రభుత్వం వత్తిడి తెచ్చి పంట నష్టపరిహారం మొత్తం రైతులకు అందే విదంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. దేశంలో ఇప్పటికే రైతుల ఆత్మహత్యలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం గతంలో జరగలేదన్నారు. మూడు నాలుగు రోజుల్లోపల ప్రభుత్వం రైతులను ఆదుకోని పక్షంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

*చిత్రం...* కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి