తెలంగాణ

ఒక్కరోజే 61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కరోనా (కోవిడ్-19) పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరింది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఆదివారం వరకు 531 మందికి కరోనా సోకినట్టు ప్రకటించగా, సోమవారం నమోదైన 61 పాజిటివ్ కేసులను కలిపి మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 592కు చేరినట్టయింది. కోవిడ్-19 కారణంగా సోమవారం ఒకరు మరణించారని అధికారులు ధృవీకరించగా, ఇప్పటివరకు కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతవరకు డిస్‌చార్జ్ అయనవారు సంఖ్య 103. కరోనా తాజా పరిస్థితిపై సోమవారం వైద్య శాఖ అధికారులు సమావేశమై సమీక్షించారు. ఆ తర్వాత వీరితో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. కరోనా సోకిన వారిలో హైదరాబాద్ నగరానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని తాజా సమాచారం వల్ల తేలింది. కోవిడ్-19 నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కరోనా సోకిన వారు ఇంకా ఎక్కడైనా ఉన్నారా అన్న అంశంపై పరిశీలన చేస్తున్నారు. వైద్య ఆరోగ్య అంశాలకు సంబంధించి అత్యవసర అవసరాలను 108 సేవలను సిద్ధంగా ఉంచామని ప్రజా ఆరోగ్య, సంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో అత్యవసర పనులకోసం రక్తాన్ని సిద్ధంగా ఉంచామన్నారు. గర్భిణుకు కాన్పుల సమయంలో నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇలాఉండగా రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాకు సంబంధించి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగినట్టు దాఖలాలు లేవని ప్రకటించారు. కోవిడ్-19 సోకిన వారికి గాంధీ దవాఖానాలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇతర ఆసుపత్రుల్లో ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించి, కరోనా ఉన్నట్టు తేలితే గాంధీ దవాఖానాకు పంపిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాకేంద్ర దవాఖానాల్లో కూడా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే సీరియస్ కేసులను గాంధీ దవాఖానాకే పంపిస్తున్నారు.