తెలంగాణ
10 లక్షల మాస్క్‌ల పంపిణీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని, కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ సోమవారం నాడు పిలుపునిచ్చారు. నగరంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పార్టీ కార్యాలయంలో మాస్క్‌ల ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పది లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కనీసం ప్రతి జిల్లాలో లక్ష మాస్క్‌లను పంచనున్నట్టు తెలిపారు. కరోనా సందర్భంగా పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా బీజేపీ అనేక సేవా కార్యక్రమాలను ప్రారంభించిందని, ఎప్పటికపుడు పరిస్థితులను మదింపు వేసి నివేదికలను రూపొందించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు కమిటీలను నియమించామని చెప్పారు. ప్రతిరోజు నిత్యావసరాలను అందించడంతోపాటు భోజనం కూడా పెడుతున్నామని చెప్పారు. నగరంలోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్త నిల్వలు లేవని తమ దృష్టికి వచ్చిందని, దీనివల్ల రక్తం అవసరమైనవారు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. రక్తం అత్యవసరమైన వారు బీజేపీ యువనేతలను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా లాక్‌డౌన్‌ను గౌరవించాలని ఆయన చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ప్రతిరోజూ పేదలకు నిత్యావసరాలను అందిస్తున్నామని అన్నారు. లాక్‌డౌన్ కాలంలో బీజేపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూనే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వలస కూలీలకు, కార్మికులకు, పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు, నర్సులకు, డాక్టర్లకు, పోలీసులకు అవసరమైన నిత్యావసరాలు అందించాలని కోరారు. దేశ హితం కోసం అనుక్షణం పాటుపడుతున్న దేశ ప్రధాని ప్రజల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయాలతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రానికి రాష్ట్రాలు సహకరించాలని చెప్పారు. టీ రాజాసింగ్, ఎన్ రామచందర్‌రావు, డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, డాక్టర్ జీ వివేక్, ఎం ధర్మారావు, చింతా సాంబమూర్తిలతో లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ కమిటీ నియమించామని ఆయన అన్నారు.
అలాగే డాక్టర్ రాజేశ్వరరావు, జీ విజయరామారావు, ప్రేం రాజ్ యాదవ్, పీ విజయచందర్‌రెడ్డి, డాక్టర్ వెంకటరావు, బీఎస్‌ఎన్ మూర్తి, డాక్టర్ సుందర్‌తో వైద్య వ్యవహారాల కమిటీ, గరికపాటి మోహనరావు, ఎపీ జితేందర్‌రెడ్డి, చాడా సురేష్‌రెడ్డి, పేరాల శేఖరరావు, ఈ లక్ష్మీనారాయణ, డాక్టర్ జీ మనోహర్‌రెడ్డితో రిసోర్సెస్ కమిటీ నియమించారు. ఈ పెద్దిరెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, అట్లూరి రామకృష్ణ, టీ ఉమామహేందర్, రాజేష్, భన్వర్‌లాల్‌తో వలస కార్మికుల సమస్యల కమిటీ, ఆకుల విజయ, వీ చాయాదేవి, నిర్మలాదేవి, యమున, కే సరళ, ఎం జయశ్రీ, జీ విజయలక్ష్మి, పీ కరుణ, డాక్టర్ వీ పద్మతో మాస్క్‌ల పంపిణీ కమిటీ, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, ఎస్ వెంకటేశ్వరరావు, రావూరి ప్రకాశ్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గోలి మధుసూదనరెడ్డి, పీ సుగుణాకరరావు, జీ శ్యాం సుందరరెడ్డితో వ్యవసాయదారుల పర్యవేక్షణ కమిటీలను నియమించారు.
*చిత్రం...పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్