తెలంగాణ

నర్సులతో ఆపరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూలై 23: కాన్పు కోసం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే పసికందును కాటేసిన సంఘటన శనివారం వరంగల్ జిల్లా పరకాల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మండలం కామారెడ్డిపల్లికి చెందిన హన్మకొండ రాము తన భార్య సబితను కాన్పు కోసం శుక్రవారం సాయంత్రం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, అక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్లు లేరని.. శనివారం ఉదయం తీసుకురావాలని కోరారు. అయితే, డెలివరీ సమయం వచ్చిందని సిబ్బందిని ప్రాధేయపడినా వారు కనికరించలేదు. దీంతో వారు మళ్లీ తమ గ్రామానికి వెళ్లారు. శనివారం ఉదయం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి రాగా డాక్టర్లు ఎవరూ లేరు. దీంతో వారు ఆసుపత్రి ఎదుట కూర్చొని డాక్టర్ల కోసం నిరీక్షించారు. అయితే, చివరికి డ్యూటీ డాక్టర్ వచ్చి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నట్లు తెలిపారు. అయితే, మధ్యాహ్నం నొప్పులు రావడంతో వారు డాక్టర్ల కోసం వార్డులో తిరిగారు. ఎక్కడ డాక్టర్లు లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, డ్యూటీ డాక్టర్ గదిలో భోజనం చేస్తునట్లు తెలుసుకొని బంధువులు నొప్పుల గురించి డాక్టరుకు చెప్పినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు నర్సులను వారి వెంట పంపించినట్లు తెలిపారు. దీంతో సబితకు నొప్పులు ఎక్కువ కావడంతో నర్సులు డెలివరీ చేసినట్లు వారు చెప్పారు. అయితే, నర్సులు డెలివరీ సమయంలో పసికందును గట్టిగా లాగడంతో సబిత ఆస్వస్థతకు గురి కాగా పసికందు మృతి చెందినట్లు వారు బోరున విలపిస్తూ తెలిపారు.

చిత్రం.. తల్లి ఒడిలో చనిపోయిన పసికందు